డ్యూడ్ స్థానంలో ఎల్ఐకె

Love Insurance Kompany to Hit the Big Screens This Diwali on October 17th

 వరుసగా రెండు సినిమాలతో రెండు సార్లు 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి రికార్డు సృష్టించాడు  కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.అందులో భాగంగా  రెండేళ్ల క్రితం లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే 100కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వగా రీసెంట్ గా డ్రాగన్ తో మరో సారి ఆ ఫీట్ రిపీట్ చేశాడు.ఇక ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులో ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఒకటి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విగ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.అయితే ఈసినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ కావాల్సివుండగా వాయిదాపడింది. అక్టోబర్ 17న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ కొద్దీ సేపటి క్రితం ప్రకటించారు.అంతేకాదు ఈనెల 27న టీజర్ ను రిలీజ్ చేయనున్నామని కూడా ప్రకటించారు.సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈసినిమాను నిర్మిస్తుంది.

ఇక ప్రదీప్ ప్రస్తుతం డ్యూడ్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.కొత్త దర్శకుడు కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.కోలీవుడ్ లో మైత్రికి ఇది రెండో సినిమా.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రేమలు ఫేమ్ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.నిజానికి ఈసినిమాను దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు ఆ స్థానంలో ఎల్ఐకె వస్తుంది. డ్యూడ్ షూటింగ్ కూడా పూర్తి కావాల్సివుంది. అన్ని కుదిరితే డిసెంబర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ వుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.