మిస్టర్ బచ్చన్ తరువాత మాస్ మహా రాజా రవితేజ నెక్స్ట్ మాస్ జాతరతో రానున్నాడని తెలిసిందే.రవితేజ కు ఇది 75వ సినిమా.సూపర్ హిట్ మూవీ సా మజవరగమన సినిమాకు రైటర్ గా పనిచేసిన భాను భోగవరపు ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇక ఈసినిమా ఆగస్టు 27న రిలీజ్ కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు.దాంతో ప్రస్తుతానికి ప్రమోషన్స్ కూడా ఆపేశారు. వినాయక చవితి హాలిడే అడ్వాంటేజ్ గా సినిమాను రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ అది కుదరలేదు.ఇక ఈసినిమా సెప్టెంబర్ సెకండ్ వీక్ లో థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ వుంది.త్వరలోనే కొత్త డేట్ ను ప్రకటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు.ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా తనకు జంటగా శ్రీలీల నటించింది. వీరిద్దరికి ఇది రెండో సినిమా.ఇంతకుముందు వీరి కాంబో లో ధమాకా రాగ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.రవితేజ లాస్ట్ హిట్ కూడా ఇదే.మరి మాస్ జాతరకు కూడా ఈ పెయిర్ సెంటిమెంట్ కలిసిస్తుందో చూడాలి.ఈసినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఇక రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తన 76వ సినిమాలో నటిస్తున్నాడు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా దసరా నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























