మహావతార్ నరసింహకు హిందీలో 150 కోట్లు 

Mahavatar Narasimha Crosses ₹150 Cr in Hindi

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ డ్రీం రన్ కొనసాగిస్తోంది.గత వారం కూలీ ,వార్ 2 రూపంలో పెద్ద సినిమాలు రిలీజైన ఆ ఎఫెక్ట్ మాత్రం మహావతార్ పై పడలేదు.స్క్రీన్ కౌంట్ తగ్గినా కలెక్షన్స్ లో మాత్రం అదరగొడుతూనే వుంది.ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల వసూళ్లను రాబట్టుకొని చరిత్ర సృష్టించింది.ఇప్పటికే ఈసినిమా అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ యానిమేటెడ్ సినిమాగా ఆల్ టైం రికార్డు సృష్టించింది.  నాలుగో వారంలోనూ అదిరిపోయే వసూళ్లను రాబట్టుకుంటుంది.ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఈ రేంజ్ లాంగ్ రన్ ఏ  సినిమాకు దక్కేలేదు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా హిందీలో అయితే ఈ సినిమా రాంపేజ్ కొనసాగిస్తోంది.శనివారం తో అక్కడ 150 కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకొని ఈ ఏడాది హైయెస్ట్ వసూళ్లను రాబట్టిన డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది.ఫుల్ రన్ లో హిందీ వెర్షన్ ఒక్కటే 175 కోట్ల మార్క్ ను చేరుకోనేలానే వుంది. ట్రెండ్ చూస్తుంటే మహావతార్ నరసింహ ఫుల్ రన్ లో 300 కోట్లపైనే వసూళ్లను రాబట్టుకునేలా వుంది.లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కడంతో  బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొస్తుంది.

ఇక తెలుగులోనూ ఈసినిమా మంచి ప్రాఫిట్స్  తీసుకొస్తుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మహావతార్ నరసింహను తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేశారు.విష్ణువు దశ అవతారాల పురాణ గాథ ఆధారంగా అశ్విన్ కుమార్ ఈసినిమాను తెరకెక్కించగా  సామ్ సీఎస్ సంగీతం అందించాడు. కన్నడ టాప్ బ్యానర్  హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించింది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.