కిష్కింధపురి ఫస్ట్ సింగిల్ ‘ఉండిపోవే నాతోనే’ రిలీజ్

Kishkindhapuri First Single Undipove Naathone Out

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన కిష్కింధపురి.. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ షురూ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా నేడు ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ‘ఉండిపోవే నాతోనే’ అనే ఈ మెలోడీ సాంగ్‌ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకునేలావుంది. రొమాంటిక్ ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ పాటకు చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతం, హృదయానికి హత్తుకునే పూర్ణాచారి లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హీరో-హీరోయిన్ మధ్య జరిగే ప్రేమావేశాలు, భావోద్వేగాలు అందంగా ఆవిష్కృతం అయ్యాయి.

ఈ పాటలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ అద్భుతమైన కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. జావేద్ అలీ వోకల్స్ మెస్మరైజ్ చేశాయి. బ్యూటీఫుల్ బీచ్‌సైడ్ విజువల్స్ చాలా ప్లజెంట్‌గా వున్నాయి. టీజర్‌లో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిన దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి, ఈ సాంగ్‌తో ఒక రొమాంటిక్ టచ్ ఇచ్చాడు. రాజు సుందరం కొరియోగ్రఫీ సాంగ్ వైబ్‌ను మరింతగా పెంచింది.

కాగా కిష్కింధపురి చిత్రానికి విజువల్స్, గ్రాఫిక్స్, సెట్స్ అన్నీ కొత్తగా, గ్రాండ్‌గా ఉండబోతున్నాయని ఇప్పటికే టీజర్ ద్వారా అర్థమైంది. ఇక ఇప్పుడు ఈ పాట విడుదలతో మూవీపై హైప్ మరింతగా పెరగనుంది. సంగీతప్రియులకు ఇది ఒక మెలోడీ ట్రీట్‌ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి ‘ఉండిపోవే నాతోనే’ సాంగ్ కిష్కింధపురి చిత్రంపై అంచనాలను పెంచేసింది. కాగా ఈ చిత్రానికి నిరంజన్ దేవరమానే ఎడిటింగ్, మనీషా ఎ దత్ ప్రొడక్షన్ డిజైనింగ్, డి. శివ కామేష్ ఆర్ట్ డైరెక్షన్ నిర్వహిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.