హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ల వార్ 2 మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.దాంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయగా ఈ రోజు సెకండ్ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేశారు.ఇందులో హృతిక్ – ఎన్టీఆర్ ల స్టెప్స్ అదుర్స్ అనిపించాయి.ఈప్రోమో జనాలకు బాగా ఎక్కేస్తుంది.ఈ ప్రోమోతో సినిమాకుమరింత హైప్ వచ్చింది.అయితే ఈ సాంగ్ లిరికల్ వీడియోను కూడా రిలీజ్ చేయడం లేదు.డైరెక్ట్ గా థియేటర్లలోనే చూడాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాకు యు/ ఏ సర్టిఫికెట్ జారీచేశారు.రన్ టైం కూడా రివీల్ అయ్యింది.2 గంటల 51 నిమిషాల నిడివితో వార్ 2 తెలుగు వెర్షన్ విడుదలకానుంది.ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు.తెలుగులో ఈసినిమాను నాగవంశీ విడుదలచేస్తున్నాడు.అందుకు గాను భారీ ధరకు వార్ 2 థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నాడు.
బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా లో కియరా అద్వానీ హీరోయిన్ గా నటించగా ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు.ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది.ఇక ఈసినిమాతో ఎన్టీఆర్ హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.అయితే వార్ 2 కి బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది. ఆగస్టు 14న వార్ 2 తోపాటు కూలీ కూడా విడుదలవుతుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























