వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా వున్న సౌత్ హీరోల్లో దుల్కర్ సల్మాన్ ఒకరు.ఓ సినిమా పూర్తికాకముందే మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు ఈ హీరో.గత ఏడాది లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన దుల్కర్ తెలుగు సినిమాలతో బిజీ అవుతున్నాడు.ప్రస్తుతం ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు.పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తుండగా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.రీసెంట్ గా విడుదలైన ఈసినిమా గ్లింప్స్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు మరో తెలుగు సినిమాను ప్రారంభించాడు దుల్కర్.అందులో భాగంగా తన 41వ చిత్రాన్ని దర్శకుడు రవి నేలకుదిటితో చేస్తున్నాడు.లవ్ స్టొరీ తో పాటు అద్భుతమైన హ్యుమన్ డ్రామా గా రూపొందనున్న ఈచిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు.ఈరోజు హైదరాబాద్లో ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.ముహూర్తపు షాట్‌కు నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టారు.దర్శకుడు బుచ్చి బాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేయగా, గుణ్ణం సందీప్, నాని, రమ్య గుణ్ణం స్క్రిప్ట్‌ను టీంకు అందజేశారు.ఫస్ట్ షాట్‌ను రవి నెలకుడిటి స్వయంగా దర్శకత్వం వహించారు.దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది.
ఈ చిత్రానికి అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ,జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తారు.అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.ఈసినిమా తెలుగు, మలయాళం,హిందీ, కన్నడ, తమిళ భాషలలో పాన్ ఇండియా విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























