యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ భారీ అంచనాల మధ్య గత గురువారం థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటుంది.దాంతో మొదటి రోజు ఈసినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. అయితే ఆ నెక్స్ట్ డే మాత్రం డ్రాప్ అవ్వగా వీకెండ్ లో మళ్ళీ పుంజుకొని బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతుంది.నిన్నటితో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 82కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఈవారంలో 100 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ వుంది.అయితే ఈసినిమాకు మహావతార్ నరసింహ తో గట్టి పోటీ ఎదురవుతుంది.యానిమేటెడ్ సినిమాగా వచ్చి మహావతార్ నరసింహ కాసుల వర్షం కురిపిస్తుంది.ఈసినిమా లేకుంటే కింగ్డమ్ కలెక్షన్స్ ఇంకా పెరిగేవే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించగా వెంకటేష్ విలన్ గా నటించాడు.అనిరుధ్ సంగీతం అందించగా నాగ వంశీ ,సాయి సౌజన్య నిర్మించారు.ఎట్టకేలకు ఈసినిమాతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు.
ఇక ఈసినిమా తరువాత విజయ్ నెక్స్ట్ తన 14వ సినిమాను మొదలు పెట్టనున్నాడు.ఈవారంలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.రాహుల్ సంకృత్యాన్ డైరెక్ట్ చేయనుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.అజయ్ -అతుల్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























