కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన మచ్ అవైటెడ్ మూవీ ‘కూలీ’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున అక్కినేని, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ క్యామియో రోల్ ప్లే చేయడం విశేషం. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలకు ఇక పదిరోజులే ఉండటంతో ప్రమోషన్స్‌ను ముమ్మురం చేశారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసిన నేపథ్యంలో, తాజాగా కూలీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ అయితే అదిరిపోయింది. లోకేశ్ కనగరాజ్ మరోసారి తన మేకింగ్‌తో మ్యాజిక్ చేశాడు. యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.
ఆయన టేకింగ్‌కి రజినీకాంత్ స్టైల్, స్వాగ్ తోడవడంతో ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మాస్ యాక్షన్, పంచ్ డైలాగ్స్, స్టైలిష్ బాడీ లాంగ్వేజ్‌తో రజినీ మరోసారి తనదైన నటనను ప్రదర్శించారు. ట్రైలర్‌లో ప్రతీ సీన్‌లోనూ ఆయన ఎనర్జీ, స్వాగ్ స్పష్టంగా కనిపిస్తుంది. తనదైన స్టైల్‌లో డైలాగులు డెలివర్ చేస్తూ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రజినీ.
ట్రైలర్ ఆసాంతం లోకేశ్ స్టయిల్ ఆఫ్ ఫ్లేవర్ కనిపిస్తుంది. అలాగే కింగ్ నాగార్జున మొదటిసారి నెగటివ్ రోల్‌లో కనిపించడం హైలైట్. లోకేశ్ నాగ్‌ను చాలా స్టైలిష్‌గా చూపించాడు. ఆయన లుక్స్, గెటప్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజం.. అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. రేపు థియేటర్లలో అభిమానులను నాగ్ క్యారక్టర్ సర్‌ప్రైజ్ చేయడం పక్కాగా కనిపిస్తోంది.
ఇక ఈ ట్రైలర్ రజినీకాంత్ అభిమానులకు భారీ ట్రీట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. సోషల్ మీడియాలో దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది. ‘ఇది రజినీ మాస్ రీ ఎంట్రీ’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి కూలీ ట్రైలర్‌తో లోకేశ్ కనగరాజ్, రజినీకాంత్ అభిమానులను మంత్ర ముగ్ధులను చేయడమే కాకుండా సినిమాపై అంచనాలను స్కై లెవెల్‌కి తీసుకెళ్లారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























