అక్కినేని హీరోల కెరీర్ లో మనం మరుపురాని సినిమాగా చెప్పొచ్చు. అక్కినేని నాగేశ్వర్ రావు , నాగార్జున ,నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించగా అఖిల్ క్యామియో రోల్ లో మెరిశాడు. ఇలా అక్కినేని హీరోలంతా ఓ సినిమాలో కనిపించారు.పైగా ఈసినిమా కల్ట్ హిట్ అనిపించుకుంది. కమర్షియల్ గాను సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా జపాన్ లో విడుదలవుతుంది ఆగస్టు 8న మనం జపాన్ లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హిందీ సినిమా బ్రహాస్త్రతో నాగార్జున జపాన్ లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈసినిమాలో నాగ్ అక్కడ నాగ్ సామ గా ఫేమస్ అయ్యాడు. దాంతో ఇప్పుడు మనం ను అక్కడ రిలీజ్ చేస్తున్నారు.జపాన్ ఫ్యాన్స్ తో కలిసి నాగ్ వర్చువల్ గా ఈ సినిమాను వీక్షించనున్నాడు.
ఇదిలావుంటే మరికొన్ని రోజుల్లో నాగార్జున ,కూలీ తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. రీసెంట్ గా కుబేర తో సాలిడ్ హిట్ కొట్టి న నాగార్జున ఈనెల 14న కూలీ తో రానున్నాడు. అయితే నాగ్ ఇందులో హీరోగా కాకుండా విలన్ పాత్రలో కనిపించనున్నాడు.దాంతో తెలుగులోనూ ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. నాగ్ కెరీర్ లో నెగిటివ్ రోల్ లో కనిపించడం ఇదే మొదటి సారి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























