సూపర్ స్టార్ కూలీ మరో 12 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై తమిళ్ లోనే కాదు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.ప్రస్తుతం ఈసినిమా ఈవెంట్ చెన్నై లో జరుగుతుంది.దీనికి కూలీ టీం అంతా హాజరైయ్యింది.ఇందులో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.దాంతో అందరి చూపు ట్రైలర్ పైనే వుంది.ఇక ఈసినిమాలో మొత్తం 8 పాటలు వున్నాయి.ఇందులో మోనికా ,పవర్ హౌజ్ ఇప్పటికే విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా ఈరోజు మిగితా పాటలను కూడా రిలీజ్ చేశారు.అనిరుధ్ ఈసినిమాకి చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది.వైలెన్స్ ఎక్కువుండడంతో A సర్టిఫికెట్ ను జారీ చేశారు.యాక్షన్ ఎంటర్టైనర్ గా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమాలో నాగార్జున విలన్ పాత్రలో కనిపించనున్నాడు.ఉపేంద్ర ,సత్య రాజ్,శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కూలీ 1000 కోట్ల సినిమా అయ్యే ఛాన్స్ లేకపోలేదు.
అయితే ఈసినిమాకు వార్ 2 తో పోటీ ఎదురుకానుంది.కూలీ విడుదలవుతున్న రోజే వార్ 2 కూడా రిలీజ్ అవుతుంది.ఎన్టీఆర్ వుండడంతో తెలుగులోనూ ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.దాంతో కూలీ తెలుగు ,హిందీలో పోటీ ఎదుర్కోవాల్సివుంటుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























