ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి, రాజకీయాల్లోకి రాకముందు అంటే, యుక్త వయస్సులో ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారన్న విషయం తెలిసిందే. కరాటేలో ఆయన గ్రీన్ బెల్ట్ హోల్డర్. తాను చేసిన కొన్ని సినిమాలలోనూ అడపాదడపా పవన్ తన విద్యను ప్రదర్శించారు. ఆయన చేసిన రియల్ స్టంట్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి కూడా. అయితే ప్రస్తుతం పవన్ దాదాపు సినిమాలకు దూరమై రాజకీయాలలో కొనసాగుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తన సీనియర్‌ని కలిశారు. ఎన్నో ఏళ్ల క్రితం మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌లో కరాటే సాధన చేసేటప్పుడు తనకు సీనియర్ అయిన ‘రెన్షి రాజా అవర్’ గారిని కలుసుకున్నారు. 1990లలో ఒకే కరాటే స్కూల్‌లో ‘షిహాన్ హుస్సైనీ’ గారి నేతృత్వంలో శిక్షణ పొందిన వీరిద్దరూ 34 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకరినొకరు కలవడం ఒక అరుదైన సంఘటనగా మారింది. ఈ సందర్భంగా పవన్ సోషల్ మీడియాలో తాము కరాటే ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను షేర్ చేయగా, ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక ఆ కాలంలో రెన్షి రాజా గారు ఇప్పటికే బ్లాక్ బెల్ట్ సాధించగా, పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ బెల్ట్ హోల్డర్‌గా మార్షల్ ఆర్ట్స్‌లో పట్టు సాధించేందుకు శ్రమించారు. ఇప్పుడు తాము శిక్షణ పొందిన అదే స్కూల్‌కి షిహాన్ హుస్సైనీ మాస్టర్ మరణానంతరం రెన్షి రాజా గారు నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో షిహాన్ హుస్సైనీ గారి పట్ల ఉన్న గౌరవాన్ని, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న ప్రేమను గుర్తుచేసుకుంటూ ఇద్దరూ అనేక మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























