మహావతార్ నరసింహాపై ప్రభాస్ ప్రశంసలు, థాంక్స్ చెప్పిన టీమ్

Rebel Star Prabhas Congratulates Team Mahavatar Narsimha

హోంబలే ఫిలిమ్స్‌ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘మహావతార్ నరసింహ’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. మాతృక కన్నడ సహా తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం కళ్ళు చెదిరే వసూళ్లతో అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. కథ, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ బ్లాక్స్ అన్నింటిలోనూ ప్రేక్షకులకు ఒక కొత్త దృశ్యానుభూతి అందిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా దీనిపై స్పెషల్ రివ్యూ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా ఈ మూవీని వీక్షించిన ఆయన, మహావతార్ నరసింహ అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. ముఖ్యంగా దీనిని ఒక పవర్‌ఫుల్ విజన్ అని పేర్కొన్న ప్రభాస్ చిత్ర దర్శకుడితో పటు టీమ్‌ని అభినందించారు.

ఇక దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్‌ స్పందించింది. ఈ మేరకు నిర్మాతలు శిల్పా ధవాన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ డార్లింగ్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. యానిమేషన్, యాక్షన్ బ్లాక్‌లలో కథపరంగా ఈ సినిమా ఎలా అలరించిందో ప్రభాస్ వివరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అయితే, ఇప్పటికే సినిమా మీద ఉన్న పాజిటివ్ బజ్‌తో థియేటర్లలో ప్రేక్షకుల స్పందన అద్భుతంగా కొనసాగుతోందని, ఒక విభిన్నమైన అనుభూతిని కలిగించే ఈ చిత్రాన్ని అందరూ తప్పక చూడండి అని వారు కోరారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.