‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్‌ రిలీజ్, అదిరిపోయిన విజువల్స్

James Cameron’s Avatar Fire and Ash Telugu Trailer Released

సినిమా ప్రపంచానికి దిక్సూచిగా మారిన ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ అద్భుత విజువల్ యూనివర్స్‌ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూడవ భాగంగా వస్తున్న ‘అవతార్: ఫైర్ అండ్ అాష్’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అలాగే అదే రోజున భారతదేశంలోని అన్ని ప్రధాన భాషలైన హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాను భారతదేశంలో ’20th సెంచరీ స్టూడియోస్ ఇండియా’ గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ ఏడాది అత్యంత భారీ హాలీవుడ్‌ రిలీజ్‌గా పేర్కొనబడుతున్న ఈ చిత్రం, ప్రేక్షకులను మళ్లీ ‘పండోరా’ అద్భుత లోకంలోకి తీసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ ట్రైలర్ గమనిస్తే.. ఇది ఈ ఏడాది కోసం ఎదురుచూస్తున్న సరికొత్త విజువల్ సాహసానికి లోతైన పరిచయం ఇస్తోంది. అయితే, ఈసారి ‘ఫైర్ అండ్ అాష్’ చిత్రంలో జేక్ సుల్లీ (సామ్ వర్థింగ్టన్), నేవి యోధురాలు నెయ్‌టిరి (జోయి సల్డానా), వారి కుటుంబం మరింత ఎమోషనల్‌గా, మరింత సాహసోపేతంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ చిత్రానికి జేమ్స్ కామెరూన్, రిక్ జాఫా, అమాండా సిల్వర్ స్క్రీన్‌ప్లే అందించగా, కథను జేమ్స్ కామెరూన్, రిక్ జాఫా, అమాండా సిల్వర్, జోష్ ఫ్రైడ్‌మన్, షేన్ సలెర్నో కలిసి రచించారు. అలాగే ఇందులో సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, ఊనా చాప్లిన్, క్లిఫ్ కర్టిస్, బ్రిటన్ డాల్టన్, ట్రినిటీ బ్లిస్, జాక్ ఛాంపియన్, బైలీ బాస్, కేట్ విన్స్లెట్ తదితరులు నటించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.