తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ కరుప్పు తో రానున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి టైటిల్ తో పాటు సూర్య ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఇక టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.రేపు సూర్య బర్త్ డే సందర్బంగా ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.98 సెకండ్ల నిడివితో రానుంది.యాక్షన్ ప్యాక్డ్ గా కట్ చేసిన ఈ టీజర్ సూర్య ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ నటుడు ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటించింది.స్వసికా ,కాళీ వెంకట్ ,నటరాజన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యకంర్ సంగీతం అందిస్తుండగా డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఈ దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి తన 46వ సినిమాలో నటిస్తున్నాడు.చాలా గ్యాప్ తరువాత సూర్య తెలుగులో సినిమా చేస్తున్నాడు.ఇందులో ప్రేమలు బ్యూటీ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగ వంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటివరకు సగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























