బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వార్ 2.ఈసినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈట్రైలర్ ఈ వారంలో రిలీజ్ కానుందని తెలిసిందే.ఇక ఇప్పుడు మేకర్స్ డేట్ కూడా ప్రకటించారు.ఈశుక్రవారం విడుదలకానుంది.2 నిమిషాల 39 సెకండ్ల నిడివి తో ఈట్రైలర్ రానుంది.అయితే ఈసినిమా రిలీజ్ కు ఇంకా చాలా రోజులే వున్నా ట్రైలర్ ను ముందుగా రిలీజ్ చేసి హైప్ మరింతగా పెంచాలని చూస్తుంది వార్ 2 టీం. మరి ట్రైలర్ లాంఛ్ కోసం ఈవెంట్ ఏమైనా చేస్తారనేది తెలియాల్సివుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగులో ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ విడుదలచేస్తున్నాడు.భారీ ధరకు ఈ థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నాడు.బ్రేక్ ఈవెన్ కావాలంటే తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్లపైనే రాబట్టాల్సివుంటుంది.అయితే వార్ 2 విడుదలవుతున్న రోజే లోకేష్ కనగరాజ్ – రజినీకాంత్ ల కూలీ కూడా విడుదలకానుంది.ఈసినిమాపై కూడా అంచనాలు భారీగా ఉండడంతో వార్ 2కు బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీ ఎదురుకానుంది.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా హిందీ ,తెలుగు తోపాటు తమిళం లో ఆగస్టు 14న విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























