ఆ పాత్రకు రానా లేదా విజయ్ సేతుపతి పర్ఫెక్ట్

Mahavatar Narasimha is a Larger-than-Life Visual Wonder, Says Director Ashwin Kumar

హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ ‘మహావతార్ నరసింహ’ విజువల్ వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వబోతోంది. మహావతార్ నరసింహకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్‌లో ఇంతకు ముందు ఎన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వబోతోంది. ఇప్పటికే విడుదలైన మహావతార్ నరసింహ ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అశ్విన్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మహావతార్ నరసింహ ఐడియా గురించి చెప్పండి?

  • మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో వస్తున్న ఫస్ట్ మూవీ మహావతార్ నరసింహ.
  • శ్రీమహావిష్ణువు దశావతారాలన్నీ లార్జర్ దేన్ లైఫ్, బిగ్ కాన్వాస్ లో ప్రజెంట్ చేయాలని ఆలోచనతో మహావతార్ యూనివర్స్ మొదలైంది.
  • యానిమేషన్ లోనే ఈ సినిమాని నిర్మించాలని ఆలోచన మొదటి నుంచి ఉంది.
  • శ్రీ మహావిష్ణువు కథని చెప్పాలంటే యానిమేషన్ అనేది ఒక బెస్ట్ మీడియం.
  • కొన్ని సార్లు నటులు దేవుని పాత్రలు చేసేటప్పుడు చాలా చాలెంజింగ్‌గా ఉంటుంది.
  • అప్పటివరకు చేసిన సినిమాల ఇమేజ్ ఈ క్యారెక్టర్ మీద పడుతుంది.
  • అందుకే ఎపిక్ కథల్ని చెప్పడానికి యానిమేషన్ బెస్ట్ మీడియం అని భావించాం.

నరసింహ అవతారాన్నే ముందుగా తీసుకు రావడానికి కారణం?

  • ప్రతి అవతారానికి ఒక విశిష్టత ఉంది. నరసింహ స్వామి రక్షకుడు.
  • నరసింహ అవతారం నేటి సమాజానికి ముఖ్యంగా యువతకి చాలా అవసరం.
  • ప్రజెంట్ సిచువేషన్‌కి నరసింహ స్వామి అవతారం ప్రేక్షకుల్లో ఒక కొత్త ఉత్తేజ ఉత్తేజాన్ని నింపుతుందని భావిస్తున్నాము.

ఇలాంటి మైథాలజీ కథ చెప్పాలనే స్ఫూర్తి గురించి?

  • ఇది మైథాలజీ కాదు.. ఇది మన చరిత్ర.
  • ప్రతి జనరేషన్‌కి మన చరిత్రని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  • ముఖ్యంగా పిల్లలకి, ఈ జనరేషన్ యువతకి మన చరిత్ర తెలియజేయాలి.
  • ఈ సినిమా చేస్తున్నప్పుడు మేము అహోబిలం వెళ్ళాము.
  • స్వామివారి ఆశీర్వాదము ఈ సినిమాపై ఉంది.
  • ఈ కథని మేము శాస్త్రాల నుంచే తీసుకున్నాము.

హోంబాలే ఫిల్మ్స్ గురించి?

  • హోంబాలే ఫిల్మ్స్‌తో కలిసి ఈ ప్రాజెక్టు చేయడం మాకు చాలా ఆనందాన్నిచ్చింది.
  • ఇలాంటి లార్జర్ దేన్ లైఫ్ సినిమాలకు వారి భాగస్వామ్యం మాకు ఎంతగానో ఉపయోగపడింది.
  • వారు ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేశారు. వారికి సినిమా చాలా నచ్చింది. మమ్మల్ని ఎంతో అద్భుతంగా గైడ్ చేశారు.

మ్యూజిక్ గురించి?

  • శ్యామ్ సియస్ అద్భుతమైన మ్యూజిక్‌ని కంపోజ్ చేశారు.
  • ఇంటర్నేషనల్ స్థాయిలో ఆర్కెస్ట్రా కంపోజ్ చేశారు.
  • చాలా అద్భుతమైన మ్యూజిషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు.
  • పవర్‌ఫుల్ డివైన్ ఫుల్ మ్యూజిక్‌ని క్రియేట్ చేశారు.
  • సినిమా చూస్తున్నప్పుడు మ్యూజిక్ ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

ఈ సినిమాల్లో విజువల్స్ ఎలా ఉండబోతున్నాయి?

  • ఇప్పటివరకు ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్‌ చేయని విజువల్స్ బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నారు.
  • వార్ సీక్వెన్స్ లన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. సరి కొత్త అనుభూతిని పంచుతాయి.
  • చాలా హై స్కేల్‌లో తీసిన సినిమా ఇది. విజువల్ వండర్. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ ఉంది.
  • పైసా వసూల్ మూవీ. అలాగే ఒక చరిత్ర, సాంస్కృతి, ధర్మాన్ని కూడా అద్భుతంగా చూపించే సినిమా ఇది

గీత ఆర్ట్స్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది?

  • గీతా ఆర్ట్స్‌కి వండర్‌ఫుల్ లెగసి ఉంది.
  • వారు మా సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది.
  • తప్పకుండా మా అందరి మీద ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాము.

ఒకవేళ ఈ ప్రాజెక్టుని ఎవరైనా ఒక హీరోతో చేసి ఉంటే ఎవరిని ఎన్నుకునేవారు?

  • హిరణ్య కశ్యప పాత్ర కోసం రానా గారు లేదా విజయ్ సేతుపతి గారు.
  • నరసింహ పాత్ర మాత్రం యానిమేట్ చేయాల్సిందే.

నెక్స్ట్ ప్రాజెక్ట్?

  • ‘మహావతార్ పరశురాం’ ప్రీ ప్రొడక్షన్‌లో ఉంది.
  • అది కూడా చాలా పెద్ద స్కేల్ లో ఉంటుంది.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.