సూపర్ స్టార్ రజినీకాంత్ మచ్ మచ్ అవైటెడ్ కూలీ రిలీజ్ కు రెడీ అవుతుంది.ఆగస్టు 14న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.లోకేష్ కనగరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేయడం కింగ్ నాగార్జున ,ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించడం తో కూలీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.అందుకు తగ్గట్లే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా చేసిన తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది కూలీ.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 500 కోట్లపైనే బిజినెస్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తమిళ్ ,తెలుగు తోపాటు హిందీలో కూడా రిలీజ్ కానుంది.8 వారాల కంటే తక్కువ ఓటీటీ డీల్ ఉంటే హిందీలో మల్టీఫ్లెక్స్ లలో రిలీజ్ అవ్వవు. కేవలం సింగిల్ స్క్రీన్ లలో మాత్రమే ప్రదర్శిస్తారు. దాంతో కూలీ హిందీ రిలీజ్ పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.అయితే కూలీ హిందీ వెర్షన్ కూడా 8 వారాల తరువాతే ఓటీటీ లోకి వచ్చేలా డీల్ సెట్ కావడంతో అక్కడ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈసినిమా ఓటీటీ రైట్స్ రికార్డు ధరకు ప్రైమ్ వీడియో దక్కించుకుంది.
లోకేష్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో మెరవనుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన సెకండ్ సింగిల్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.మూడో సాంగ్ పవర్ హౌస్ ఈనెల 22న రిలీజ్ చేయనున్నారు.సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























