పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు పార్ట్ -1’. జూలై 24న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో టీమ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ టికెట్ ధరల పెంపునకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా దీనికి సంబంధించి ఇప్పటికే చిత్ర నిర్మాత, మెగా సూర్య ప్రొడక్షన్ అధినేత ఏఎం. రత్నం ఈ సినిమా టికెట్ ధరలను పెంచడానికి అనుమతి కోరుతూ ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆయన విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా సమ్మతించింది. టికెట్ ధరలను పెంచేందుకు అనుమతినిచ్చింది. సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల వరకు రేట్లు పెంచడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ ధరలు సినిమా విడుదల తేదీ 24.07.2025 నుండి 02.08.2025 వరకు వర్తిస్తాయి. పెంచిన రేట్ల ప్రకారం ఏపీలో టికెట్ ధరలు ఇలా ఉండనున్నాయి..
- సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై లోయర్ క్లాస్ – ₹100/- (జీఎస్టీతో కలిపి)
- సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై అప్పర్ క్లాస్ : ₹150/- (జీఎస్టీతో కలిపి)
- మల్టిప్లెక్స్‌ల్లో: ₹200/- (జీఎస్టీతో కలిపి)

కాగా జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, లైసెన్సింగ్ అథారిటీలు సంబంధిత చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ ఉత్తర్వుల కింద సినిమా టికెట్ ధరలు పెంచడంపై సమన్వయం పాటించాలని ప్రభుత్వం సూచించింది. ఇక ఇదిలావుంటే, మరోవైపు టికెట్ ధరలను పెంచాలంటూ చిత్రబృందం తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఏంటనేది ఇప్పటివరకూ తెలియలేదు.
క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ హిస్టారికాల్ బ్యాక్‌డ్రాప్‌లో.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























