విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఎట్టకేలకు మరో వాయిదా లేకుండా విడుదలకు రెడీ అవుతుంది ఈనెల 31న థియేటర్లలోకి రానుంది.తెలుగు తోపాటు తమిళ , హిందీ లో రిలీజ్ కానుందని తెలిసిందే.అయితే హిందీలో ఈసినిమా టైటిల్ మారింది.అక్కడ ఈసినిమా సామ్రాజ్య అనే టైటిల్ తో విడుదలకానుంది.కింగ్డమ్ అనే టైటిల్ వేరే వాళ్ళు ఆల్రెడీ హిందీలో రిజిస్టర్ చేసుకొని ఉండడం తో టైటిల్ మార్చాల్సివచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచనున్నారు.అందులో భాగంగా వచ్చే వారం లో ట్రైలర్ ను రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.ఆలాగే భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈసినిమా కోసం నిర్మాత నాగవంశీ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోట్ చేస్తున్నాడు.
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈసినిమాను తెరకెక్కిస్తుండగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.మరోవైపు విజయ్ కి ఈసినిమా విజయం తప్పనిసరి కానుంది.విజయ్ చాలా ఏళ్ళ నుండి భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు.మరి ఈసినిమాతో విజయ్ సాలిడ్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























