కొత్తపల్లిలో ఒకప్పుడు మరో C/O కంచరపాలెం : డైరెక్టర్ ప్రవీణ పరుచూరి

kothapallilo-okappudu-is-another-c-o-kancharapalem-says-director-praveena-paruchuri

చిన్న సినిమాలను సపోర్ట్ చేయడంలో ముందుంటాడు రానా దగ్గుబాటి.ఇక తన బ్యానర్ స్పిరిట్ మీడియా సమర్పణలో వస్తున్న రూరల్ కామెడీ కొత్తపల్లిలో ఒకప్పుడు. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మించగా మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రవీణ పరుచూరి సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీరు నిర్మాత, నటి కదా.. డైరెక్షన్ వైపు రావాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది?

-నాకు డైరెక్షన్ చేయాలని ఆసక్తి ఎప్పటి నుంచో ఉంది. చిన్నప్పుడు నుంచిసినిమాలు అంటే పిచ్చి. నేను ఆంధ్ర నాట్యం నేర్చుకున్నాను. తర్వాత కూచిపూడి. అలా నటన సంగీతం సాహిత్యం గురించి పరిచయం ఏర్పడింది. అమెరికాలో యాక్టింగ్ క్లాసెస్ కి వెళ్ళాను. అక్కడ ఫిలిం మేకింగ్ సంబంధించి ఒక షార్ట్ కోర్సు చేశాను. డైరెక్టర్ అనేది చాలా డిఫికల్ట్ క్రాఫ్ట్. ప్రొడక్షన్ చేసి నేర్చుకోవాలని నిర్ణయించకున్నాను. నా గత రెండు సినిమాలు అన్ని క్రాఫ్ట్స్ మీద అనుభవాన్ని ఇచ్చాయి.

ఈ కథ ఎలా మొదలైంది?

కరోనా సమయంలో అందరం బాధపడ్డాం. ఒక డాక్టర్ గా ఇంకా ఎక్కువ బాధ ఉండేది. ఆ సమయంలో నేను సినిమాల గురించి ఎక్కువ ఆలోచించలేదు. మరో సినిమా చేస్తానని కూడా అనుకోలేదు. అప్పుడు మిక్కీ మేయర్ గారి కొలాబరేషన్ లో షార్ట్ ఫిలిం చేశాను. తరువాత ఒకసారి ఇండియాకు వచ్చాను. ఈ కథ ఆలోచన అప్పుడే పుట్టింది. ఇది కంచరపాలెం లాగానే ఒక మంచి ఎంటర్టైనర్ అవుతుందనే నమ్మకం వుంది.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?

నా క్యారెక్టర్ చాలా ఫన్ అనిపించింది. ఊర్లో ఉండే మహిళలు కాస్త టఫ్ గా ఉంటారు. నాది కూడా అలాంటి టఫ్ క్యారెక్టర్. నా పర్సనాలిటీకి చాలా డిఫరెంట్ గా ఉండే క్యారెక్టర్ ఇది. ఇందులో నాకు రెండు అద్భుతమైన సీన్స్ ఉన్నాయి. పుష్ప సినిమాలో జాతర సీన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ఇందులో అలాంటి ఒక సీక్వెన్స్ ఉంది. అది తప్పకుండా మీ అందరిని అలరిస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమాకి చాలా మంచి స్క్రీన్ ప్లే కుదిరింది. అలాగే చాలా మంచి విజువలైజేషన్ ఉంది.

మీరు డాక్టర్ కదా వృత్తిపరంగా చాలా బిజీగా ఉంటారు. అలాంటిది మీకు సినిమాలు చేయాలని ఆలోచన ఎలా వచ్చింది?

డాక్టర్ గా నిరంతరం ప్రాక్టీస్ లో ఉంటాను. అలాంటి సమయంలో క్రియేటివ్ అవుట్లెట్ కావాలి. చిన్నప్పుడు నుంచి సినిమా అంటే ఆసక్తి ఉండడంతో సినిమా చేస్తే అలాంటి ఒక క్రియేటివ్ అవుట్లెట్ దొరుకుతుందని భావించాను. కంచరపాలెంకి అవసరమై యాక్టింగ్ చేశాను. ఈ సినిమాలో కూడా క్యారెక్టర్ చాలా ఫన్ గా ఉంది. అయితే నేను ఎప్పుడు కూడా డైరెక్టర్ కావాలనే అనుకున్నాను.

ఈ సినిమా ట్రైలర్ చూస్తే హారర్, సూపర్ నేచురల్ ఎలిమెంట్ కనిపిస్తోంది ?

హారర్ కాదు గాని ఇందులో సూపర్ నేచురల్ ఎలిమెంటు ఉంది. మనకి చాలామంది గ్రామ దేవతలు ఉన్నారు. మనికి చాలా వాటిపై విశ్వాసం,నమ్మకం ఉంటుంది. నాకు ఈ నమ్మకాలు మీద మొదటి నుంచి చాలా ఆసక్తి. ఈ సినిమాల్లో అలాంటి ఒక నమ్మకాన్ని చాలా న్యూట్రల్ గా చూపించడం జరిగింది.

నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. ఒక మంచి కథ చెప్తే తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా గొప్ప మనసుతో చూస్తారు. ఇప్పటివరకు చేసిన రెండు సినిమాలను కూడా చాలా అద్భుతంగా ఆదరించారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారనే ఆదరించి ప్రోత్సహిస్తారనే నమ్మకం ఉంది.

ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు కూడా ఉత్తరాంధ్ర నేపథ్యంలోనే చేశాను. ఇకపై ఒక సినిమా చేసే అవకాశం వస్తే సిటీ బ్యాక్ డ్రాప్ తో చేయాలని ఉంది.ఈ సినిమా ప్రివ్యూస్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిన్నపిల్లలకి యూత్ కి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చింది. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.

రానా గారి గురించి ?

రానా గారు కేరాఫ్ కంచరపాలెం నుంచి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఈ సినిమా ఆయనకి చాలా నచ్చింది ఆయన ఈ సినిమాని ప్రజెంట్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాము.

ఈ సినిమా నుంచి మీరు ఏం నేర్చుకున్నారు?

ఏదైనా సాధించాలంటే విల్ పవర్ ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మనం అనుకున్నది సాధించగలం. అది ఈ సినిమా నేర్పింది.

ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి ?

మొన్న ప్రెస్ మీట్ లో ఒకరు … ఈ సినిమా పెద్ద వంశీ గారి సినిమా లాగా ఉందని చెప్పారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఒక జంధ్యాల గారి సినిమా లాగా మన చుట్టూ జరుగుతున్న కథలాగే అనిపిస్తుంది.

భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?

ఈ సినిమా ఆడియన్స్ కి నచ్చి మంచి విజయాన్ని ఇస్తే మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. నాకు ఒక యాక్షన్ సినిమా చేయాలని కోరిక ఎప్పటినుంచో ఉంది. ఒక మంచి మార్షల్ ఆర్ట్ ఫిలిం చేయాలనే ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.