పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’. జూలై 24న థియేటర్లలోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలలో జోరు పెంచనున్నారు. ఇప్పటివరకు రిలీజైన థియేట్రికల్ ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి 3 కీలక అప్‌డేట్స్ అందించింది చిత్ర యూనిట్. త్వరలో కొత్త పాటకి సంబంధించి మేకింగ్ వీడియో రిలీజ్ చేయనుంది. ఇంకా ఒక పవర్ ప్యాక్డ్ సాంగ్‌ను కూడా విడుదల చేయనుంది. అలాగే వీటితో పాటుగా ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు మేకర్స్. దీనిని వైజాగ్‌లో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. మొత్తానికి ఈ వరుస అప్‌డేట్స్‌తో వీరమల్లుపై అంచనాలు మరింతగా పెరిగుతున్నాయి.
యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ హిస్టారికాల్ బ్యాక్‌డ్రాప్‌లో.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























