హరిహర వీరమల్లు సీడెడ్ రైట్స్ ఆ సంస్థ చేతిలో

Hari Hara Veera Mallu Ceded Rights Acquired by Deepa Arts

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన మచ్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ హిస్టారికాల్ బ్యాక్‌డ్రాప్‌లో.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. రీసెంట్‌గా విడుదలైన వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్‌ కూడా అత్యధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టించింది. జూలై 24న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అందించింది చిత్ర యూనిట్.

భారీ అంచనాలు నెలకొన్న క్రమంలో హరిహర వీరమల్లు హక్కులు దక్కించుకునేందుకు బయ్యర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా జరుగుతోంది. ఇప్పటికే తమిళనాడు థియేట్రికల్ హక్కులను శక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీ భారీ ధరకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో ఇప్పుడు తాజాగా ఈ మూవీ సీడెడ్ రైట్స్ కళ్ళు చెదిరే రేటుకి అమ్ముడుపోయాయి. దీపా ఆర్ట్స్ సంస్థ అత్యధిక ధరకు ఈ హక్కులను దక్కించుకుంది. ఇలా విడుదలకు ముందే వీరమల్లు సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్‌ చేయడం సినిమాపై హైప్ మరింతగా పెంచుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.