కిరీటి రూపంలో ఇండస్ట్రీకి మరో ప్రామిసింగ్ స్టార్ వస్తున్నాడు – శివ రాజ్‌కుమార్

Shiv Rajkumar Hails Kireeti as Industry's Next Big Promising Star

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్‌’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నటి జెనీలియా, సీనియర్ నటుడు రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్‌ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మేకర్స్ బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం . కిరీటీ నాకు చిన్నప్పటినుంచి తెలుసు. జూనియర్ టీజర్, ట్రైలర్, పాటలు చూశాను. కిరీటి చాలా అద్భుతంగా డాన్స్ చేశాడు. తన పెర్ఫార్మన్స్ చాలా బాగుంది.”

“కిరిటి రూపంలో మరో ప్రామిసింగ్ స్టార్ ఇండస్ట్రీకి వస్తున్నాడు. తను డాన్స్‌లో సూపర్ సీనియర్ అనిపిస్తున్నారు. అలాగే శ్రీలీల కూడా మంచి డ్యాన్సర్. వారి కెమిస్ట్రీ చాలా బాగుంది. జెనీలియా గుడ్ హ్యూమన్ బీయింగ్. తను ఈ సినిమాలో చాలా చక్కని పాత్ర పోషించారు. రవిచంద్రన్ అన్నతో నాకు ఎప్పటినుంచో స్నేహం ఉంది. ఆయన ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నారు. డైరెక్టర్ సినిమాని చాలా అద్భుతంగా తీశారని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతుంది.”

“దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సూపర్ స్టార్. జనార్దన్ రెడ్డి గారు ఈవెంట్ గురించి చెప్పినప్పుడు తప్పకుండా వస్తాను. ఇది నా ఫ్యామిలీ ఈవెంట్ అని చెప్పాను. కిరీటికి ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి. కిరీటికి, శ్రీలీలకి టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. జూలై 18న రిలీజ్ అవుతున్న సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.