కింగ్‌డమ్ సెకండ్ సింగిల్ రానుంది

Kingdom Second Single Anna Antene to be Released in Soon

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మచ్ అవైటెడ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ మూవీ జూలై 31న థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను ముమ్మురం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్‌ ‘హృదయం లోపల’ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా కీలక అప్‌డేట్ అందించారు. కింగ్‌డమ్ సినిమా నుండి త్వరలో సెకండ్ సింగిల్ రానున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రేపు సాయంత్రం ప్రోమోను రిలీజ్ చేయనున్నారు. అయితే ఇది అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో రూపొందింది. విజయ్ అన్నగా సత్యదేవ్ కనిపించనున్నారు.

కాగా ఈ చిత్రానికి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ సింగిల్‌ మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేసిన నేపథ్యంలో త్వరలో రానున్న రెండో పాటపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.