ఎనర్జిటిక్ ఫోక్ సాంగ్‌గా సీతా పయనం ఫస్ట్ సింగిల్‌

Seetha Payanam First Single Ye Oorikelthave Pilla Receiving Superb Response

మల్టీ ట్యాలెంటెడ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్, నిరంజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అర్జున్, ధ్రువ సర్జా పవర్ ఫుల్ పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా దివంగత ప్రముఖ కళాకారుడు గద్దర్ గారి భార్య విమలా గద్దర్ ఈ సినిమా నుంచి ‘ఏ ఊరికెళ్తావే పిల్లా’ పాటను లాంచ్ చేసారు. కనకవ్వ, గంగవ్వ, జోగిని శ్యామల, బేబీ లాంటి జానపద కళాకారుల సమక్షంలో సీత పయనం టీం అందరిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో గద్దర్ కుమార్తె వెన్నల గద్దర్ కూడా పాల్గొన్నారు.

అనూప్ రూబెన్స్ ఈ సాంగ్ ని ఎనర్జిటిక్ ఫోక్ నెంబర్‌గా కంపోజ్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్, మధు ప్రియ హై ఎనర్జీ వోకల్స్ కట్టిపడేశారు. చంద్రబోస్ సాహిత్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ సాంగ్ లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. విజువల్స్ చాలా ప్లజెంట్ గా వున్నాయి. వినగానే కనెక్ట్ అయ్యే ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ అయ్యింది.

ఇక ఈ సినిమాకి ట్యాలెంటెడ్ తారాగణంతోపాటు పేరొందిన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. కోలీవుడ్ సీనియర్ నటులు సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే టాప్ టెక్నిషియన్స్ జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ, అయూబ్ ఖాన్ ఎడిటింగ్ నిర్వహిస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.