చాలా గ్యాప్ తరువాత ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ,హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ రీసెంట్ గానే మళ్ళీ స్టార్ట్ అయిన విషయం. గత నెలలో ఈ షూటింగ్ స్టార్ట్ కాగా నాన్ స్టాప్ గా జరుగుతుంది. పవన్ ఇచ్చిన డేట్స్ ను పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నాడు హరీష్ శంకర్.ఈనెలలో పవన్ పార్ట్ తాలూకు షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నాడు.పవన్ కూడా ఉస్తాద్ ను వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేసే పనిలో వున్నాడు.అందుకే అటు పొలిటికల్ గా బిజీ గా వున్న సరే డేట్స్ మిస్ అవ్వకుండా కంటిన్యూగా షూట్ లో పాల్గొంటున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హరీష్ శంకర్ మార్క్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.గబ్బర్ సింగ్ తరువాత పవన్ -హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు వున్నాయి.
.
ఇక ఈనెల 24న పవన్ కళ్యాణ్ ,హరి హర వీరమల్లుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో క్రిష్ ,జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.భారీ బడ్జెట్ తో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు.చాలా గ్యాప్ తరువాత పవన్ కొత్త సినిమాతో థియేటర్లలోకి వస్తుండడం తో ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఇదిలావుంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు.సుజీత్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మెహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్యాచ్ వర్క్ పూర్తి చేయాల్సివుంది.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























