మచ్ అవైటెడ్ బాహుబలి రీ రిలీజ్ డేట్ వచ్చేసింది. రెండు పార్ట్ లు కలిపి సింగిల్ పార్ట్ గా విడుదలచేయనున్నారు. బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ తో అక్టోబర్ 31న రీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.ఓకే సినిమాగా వస్తుండడంతో రన్ టైం ఎలా సెట్ చేస్తారనేది ఆసక్తిగా మారింది.ఇక ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుండడం తో బాహుబలి 1& 2 కూడా మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటినుండో కోరుకుంటున్నారు.ఇక ఇప్పటి జనరేషన్ కూడా థియేటర్లకు క్యూ కట్టడం ఖాయం. దాంతో బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ కలెక్షన్ల విషయంలో రికార్డులను తిరగరాయనుంది. దాదాపు 100కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ లేకేపోలేదు. మరి బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సరిగ్గా 10 ఏళ్ళ క్రితం థియేటర్లలోకి వచ్చిన బాహుబలి 1 ఇండియన్ సినిమా స్థాయిని మార్చేసింది.ఈసినిమా దాదాపు 650 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇక రెండేళ్ల తరువాత సీక్వెల్ బాహుబలి 2 సృష్టించిన విధ్వసం అంతా ఇంత కాదు. ఇప్పటికే ఈసినిమా పేరిట వున్న రికార్డులను ఏ సినిమా కూడా చెరిపేయలేక పోయింది.
రాజమౌళి ఈసినిమాలను డైరెక్ట్ చేయగా రెబల్ స్టార్ ప్రభాస్ ,రానా , అనుష్క , రమ్యకృష్ణ , నాజర్ తదితరులు నటించారు.కీరవాణి సంగీతం అందించగా భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా నిర్మించింది. ఈసినిమాలతో ప్రభాస్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























