‘క’ సినిమాతో రీసెంట్గా బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ‘KA ప్రొడక్షన్స్’ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఈ బ్యానర్లో తెరకెక్కనున్న ఫస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాకి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు నేడు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. కంటెంట్ బేస్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా తన గత సినిమాల్లో అసిస్టెంట్ కెమెరామెన్‌గా పనిచేసిన సాయి తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. కాగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ జరుగుతుండగా.. త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్స్ వరుసగా వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























