నేచురల్ స్టార్ నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది ప్యారడైజ్. డిఫ్రెంట్ సబ్జెక్టు తో రా & రస్టిక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నాని సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది.స్పెషల్ గా వేసిన సెట్ లో ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ ఆధ్వర్యంలో ఇంటెర్నేషల్ స్టంట్ మాస్టర్ల సహకారం తో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు.ఈ హై-ఐన్‌టెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ లో నాని తోపాటు 300మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలెట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో కిల్ ఫేమ్ రాఘవ జ్యూయెల్ నటిస్తున్నాడు. ఈ న్యూస్ ఎప్పుడో బయటికి రాగ తాజాగా మేకర్స్ కూడా కంఫర్మ్ చేశారు.ఈరోజు రాఘవ బర్త్ డే సందర్భంగా విష్ చేస్తూ .. అందరిని ఆశ్చర్యానికి గురిచేసే, విభిన్నమైన పాత్ర కోసం ఆయనను ఈసినిమాలోకి స్వాగతిస్తున్నాం అని స్పెషల్ వీడియో ను పోస్ట్ చేసింది ది ప్యారడైజ్ టీం.ఇక కిల్ లో రాఘవ విలన్ రోల్ లో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకోగా ది ప్యారడైజ్ లో కూడా విలన్ గా నటించనున్నాడు.
అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.తెలుగు ,తమిళ, కన్నడ ,మలయాళం ,హిందీ తోపాటు ఇంగ్లీష్ ,స్పానిష్ భాషల్లో కూడా విడుదలకానుంది.ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























