యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటుడు సుహాస్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. లవ్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమాకి రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ నటి మాళవిక మనోజ్ ఈ మూవీతో హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. అందరిని నవ్వించే ఓ యువకుడి కథగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్ మూవీ లవర్స్‌ని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నేడు తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. ఇది ఒక క్యూట్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్, హీరో, హీరోయిన్స్ ఎనర్జీ, ఇలా ఈతరం ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారిని అలరించే ఫుల్ ప్యాకేజీగా ఈ చిత్రాన్ని రూపొందించారని అర్థమవుతోంది. సుహాస్, మాళవిక మధ్య వచ్చే సన్నివేశాలు అలరించాయి. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ హరీశ్ శంకర్, మారుతి అతిథి పాత్రల్లో కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
ఈ చిత్రంలో ‘నువ్వు నేను’ ఫేమ్ అనితా హస్సానందని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కామెడీ పండించడానికి ప్రభాస్ శ్రీను, ఆలీ నటిస్తుండగా.. ఇటీవల ‘యానిమల్’ సినిమాలో కనిపించిన నటుడు బబ్లూ పృథ్వీ రాజ్ ఈ చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నారు. వీరితోపాటు రవీందర్ విజయ్, రఘు కారుమంచి, మొయిన్, సాత్విక్ ఆనంద్, నయని పావని తదితర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వీ ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్ల నిర్మాతగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రథన్ సంగీతాన్ని అందిస్తుండగా.. మణికంఠం. ఎస్ సినిమాటోగ్రఫీ, భవిన్ షా ఎడిటింగ్ చేస్తున్నారు. వీరితోపాటు మరికొందరు అనుభవజ్ఞులు ఈ చిత్రానికి సాంకేత బృందంగా వ్యవహరిస్తున్నారు. స్టార్ హీరో రానా దగ్గుబాటి హోం బ్యానర్ స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుండటం విశేషం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: