హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ల వార్ 2 వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈసినిమా సాంగ్ షూట్ జరుగుతుంది.హృతిక్ ,ఎన్టీఆర్ లపై ఈసాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ఈసాంగ్ ను కంపోజ్ చేయగా బోస్కో – సీజర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.ఇక సాంగ్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లే.ఆ తరువాత ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎన్టీఆర్ ఉండడంతో వార్ 2కి తెలుగులో కూడా భారీ హైప్ వుంది.దాంతో తెలుగు థియేట్రికల్ రైట్స్ భారీ ధర పలికాయి.ప్రముఖ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఈ రైట్స్ సొంతం చేసుకున్నాడు.తెలుగు రాష్ట్రాలకు గాను అన్ని భాషల థియేట్రికల్ రైట్స్ ను రికార్డు ధరకు దక్కించుకున్నాడు.ఈసినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 160 కోట్లపైనే వసూళ్లను రాబట్టాల్సివుంటుంది.
రీసెంట్ గా దేవర డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా నాగవంశీనే తీసుకున్నాడు.120కోట్ల కు ఈ రైట్స్ తీసుకోకగా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి మంచి లాభాలను తీసుకొచ్చింది.ఇక అదే నమ్మకంతో మరోసారి నాగవంశీ తన అభిమాన హీరో సినిమా రైట్స్ తీసుకున్నాడు.ఇక వంశీ ఈ రైట్స్ తీసుకోవడం తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.ఆగస్టు 14న ఈసినిమా తోపాటు కూలీ కూడా రిలీజ్ అవుతుంది.కూలీపై కూడా తెలుగులో భారీ అంచనాలు వున్నాయి.దాంతో వార్ 2 కూలీ తోవార్ కు దిగాల్సి ఉంటుంది.వార్ 2ను బ్రహ్మస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























