‘పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, కీడా కోలా’ వంటి హిట్ చిత్రాలతో టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చాలా రోజుల తర్వాత తన తదుపరి సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే ఇది ఆయన దర్శకత్వం వహిస్తున్న మూవీ కాదు, హీరోగా నటిస్తున్నది కావడం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రానికి ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు నేడు చిత్ర యూనిట్ తెలిపింది. AR సజీవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తెలుగమ్మాయి ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తుండగా.. బ్రహ్మాజీ కీలక పాత్రను పోషిస్తున్నాడు. IN10 మీడియా నెట్వర్క్, మూవీవెర్స్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణానితో కలిసి ‘S ఒరిజినల్స్’ పతాకంపై ప్రొడ్యూసర్ సృజన్ యెరబోలు నిర్మిస్తున్నారు. కాగా జై క్రిష్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























