వరుస సినిమాలు గా చేస్తూ సౌత్ లో ప్రస్తుతం అంత్యంత బిజీగా వున్న హీరో ఎవరంటే అది తమిళ హీరో ధనుష్.ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా చేసుకుంటూ వెళ్తున్నాడు. కుబేర చేసే టైంలో అయితే ఏకంగా మరో రెండు సినిమాలు చేశాడు.అందులో ఇడ్లి కడై ఒకటి కాగా మరొకటి హిందీ సినిమా తేరే ఇష్క్ మే.మూడు రోజుల క్రితమే ఈసినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ధనుష్, ఇడ్లీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు.కుబేర తరువాత ధనుష్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఇదే.ఇడ్లీ కడైలో నటించడమే కాదు తనే డైరెక్ట్ చేస్తున్నాడు.ఇందులో నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా అరుణ్ విజయ్ ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అక్టోబర్ 2న విడుదలకానుంది.
ఇక నెక్స్ట్ ధనుష్, విగ్నేష్ రాజా డైరెక్షన్ లో సినిమా చేయనుకున్నాడు.ఈసినిమా కోసం పూజా హెగ్డే ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట.అదే జరిగితే ధనుష్ , పూజా కలిసి నటించడం ఇదే మొదటి సారి కానుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుండగా జూలై 14నుండి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ ఈసినిమాను నిర్మించనుంది. కేవలం 90రోజుల్లో ఈసినిమా పూర్తి చేయనున్నారట.ధనుష్ ఈసినిమా కోసం 28రోజులు డేట్స్ ఇచ్చారని సమాచారం.త్వరలోనే ఈసినిమాను అఫిషియల్ గా ప్రకటించనున్నారు.ఇక ఈ సినిమా కాకుండా ధనుష్ లైనప్ లో చాలా సినిమాలే వున్నాయి.అందులో అబ్దుల్ కలాం ,ఇళయరాజా బయోపిక్ లు కూడా చేయాల్సివుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: