క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’ గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఇది బ్లాక్ బస్టర్ వేదం విజయం తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా, అలాగే UV క్రియేషన్స్‌తో అనుష్క కు నాల్గవ చిత్రం కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో తమిళ స్టార్ విక్రమ్ ప్రభు దేశీ రాజు అనే లీడ్ క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు. అయితే ఈనెల 11న రిలీజ్ కావాల్సివుండగా తాజాగా ఘాటీ పోస్ట్‌పోన్ అయింది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే బెటర్ క్వాలిటీతో కూడిన సినిమాను ప్రేక్షకులకు అందించడానికి, అలాగే ప్రేక్షకులకు రేపు థియేటర్లలో మంచి ఎక్స్‌పీరియన్స్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం అని ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ఇక త్వరలోనే న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటర్. చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. ఈ చిత్రం హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో ఏప్రిల్ 18న గ్రాండ్ గా విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: