తొలితరం తెలుగు నటుడు, అగ్ర కథానాయకుడు నందమూరి తారక రామారావు తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు. వాటిలో ‘వేటగాడు’ ఒకటి. 1979 జూలై 5న విడుదలైన ఈ చిత్రం నాడు బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. టికెట్ ఖరీదు మూడు రూపాయలు కూడా లేని నాటి రోజుల్లోనే కోట్ల రూపాయల కలెక్షన్స్ కళ్లజూసిందంటే ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా వేటగాడు చిత్రాన్ని రోజా మూవీస్ పతాకంపై నిర్మాతలు అర్జునరాజు, శివరామరాజు నిర్మించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీదేవి ఎన్.టి.ఆర్‌కి జంటగా నటించింది. 400 రోజులకు పైగా ఆడి రికార్డ్ సృష్టించిన ఈ చిత్రం విడుదలై నేటితో 46 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వేటగాడు చిత్రం సాధించిన ఘనతలు, మైలురాళ్ళు వంటి విశేషాలు మీకోసం ఇక్కడ అందిస్తున్నాం..
వేటగాడు సినిమా విశేషాలు..
- ఎన్.టి.ఆర్, శ్రీదేవి జంటగా నటించిన తొలి చిత్రం.
- మొదటి రన్‌లో 40 కేంద్రాలలో, లేట్ రన్‌లో మరో 50 కేంద్రాలలో 50 రోజులు ఆడింది.
- 29 కేంద్రాలు (26 డైరెక్ట్)లో 100 రోజులు ఆడింది.
- 6 కేంద్రాలలో 175 రోజులు, 3 కేంద్రాలలో 200 రోజులు ఆడింది.
- హైదరాబాద్‌లో 300 రోజులు, 365 రోజులు, 400 రోజులు, 418 రోజులు ప్రదర్శించబడింది.
- మొదటి వారం 26 లక్షలు వసూలు చేసింది.
- 53 రోజులకు కోటి రూపాయలు అందుకుంది.
విజయవాడ దుర్గా కళామందిరం థియేటర్‌లో నాటి టికెట్ ధరలు..
- లోయర్ క్లాస్ – 0.75 పైసలు
- బెంచ్ – 1.40 పైసలు
- చైర్ – 2.10 పైసలు
- రిజర్వ్డ్ – 2.60 పైసలు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: