కింగ్‌డమ్‌ నుండి సత్యదేవ్‌ ఫస్ట్ లుక్ రివీల్

Team Kingdom Introduces Actor Satya Dev as Siva on His Birthday

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘కింగ్‌డమ్‌’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కొద్దిరోజులక్రితం విడుదలైన ఫస్ట్ సింగిల్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆగస్టు 1న ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఇక ఇదిలావుంటే తాజాగా కింగ్‌డమ్ సినిమా నుండి నటుడు సత్యదేవ్‌ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. మూవీలో సత్యదేవ్ ‘శివ’ అనే పాత్రలో నటించనున్నాడు. ఈరోజు సత్యదేవ్ జన్మదినం సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేశారు. ఇందులో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతోంది.

ఈ మేరకు సోషల్ మీడియాలో.. టీమ్ కింగ్‌డమ్ నటుడు సత్యదేవ్‌ను తన పుట్టినరోజున శివగా పరిచయం చేస్తుంది. అతను త్వరలో బిగ్ స్క్రీన్‌పైకి తీసుకురానున్న తుఫాను అంత భయంకరమైనది” అని పేర్కొంది. కాగా త్వరలో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్ రానున్నాయి. రిలీజ్ డేట్, టీజర్ మరియు పాటలకు సంబంధించి కీలక అనౌన్స్‌మెంట్‌ రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.