పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మచ్ అవైటెడ్ మూవీ హరి హర వీరమల్లు నుండి నిన్న ట్రైలర్ రిలీజ్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.కేవలం 24 గంటల్లోనే తెలుగు ట్రైలర్ యూట్యూబ్ లో 48 మిలియన్ల వ్యూస్ ను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.దాంతో సౌత్ లోనే సింగిల్ లాంగ్వేజ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన ట్రైలర్ గా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు ఈ రికార్డు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 పేరిట ఉండేది.24 గంటల్లో పుష్ప 2 (44.67) మిలియన్ల వ్యూస్ ను రాబట్టగా హరి హర వీరమల్లు ఆ రికార్డు ను బీట్ చేసింది.ఇక ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ తో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హిట్ టాక్ వస్తే రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది ఈసినిమా.త్వరలోనే భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.పవన్ కూడా ప్రమోషన్స్ కు హాజరుకానున్నాడు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను క్రిష్ ,జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయగా నిధి అగర్వాల్ ,నోరా ఫతేహి, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం నిర్మిస్తున్నారు.ఈనెల 24న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఇక పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ ను పూర్తి చేసే పనిలో వున్నాడు.గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. హరీష్ శంకర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఇక ఈసినిమా కన్నా ముందు పవన్ ఓజీ తో రానున్నాడు.పవన్ ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేయగా సెప్టెంబర్ 25 న విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: