అర్జున్ దాస్‌కి పవన్ కల్యాణ్ థాంక్స్, ట్వీట్ వైరల్

Power Star Pawan Kalyan Thanks Arjun Das, Tweet Goes Viral

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘హరిహర వీరమల్లు’. రీసెంట్‌గా ఈ మూవీ థియేట్రికల్ ట్రైల‌ర్ విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అయితే ముఖ్యంగా ట్రైల‌ర్‌లోని బేస్ వాయిస్‌కి అంద‌రూ ఫిదా అయ్యారు. వీరమల్లు క్యారక్టర్ గురించి వివరించిన ఆ వాయిస్ మ‌రెవ‌రిదో కాదు, ప్రముఖ తమిళ నటుడు అర్జున్ దాస్‌ది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అర్జున్ దాస్‌ ఇంతకుముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న మరో మూవీ ‘ఓజీ’ గ్లింప్స్‌కి ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పుడు తాజాగా హరిహర వీరమల్లు ట్రైల‌ర్‌లో కూడా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ మూవీ లవర్స్‌ని అలరిస్తోంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా అర్జున్ దాస్‌కి థాంక్స్ చెప్పారు.

ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా.. “ప్రియమైన సోదరుడు అర్జున్ దాస్, నేను మీకు కృతజ్ఞుడను. చాలా అరుదుగా, నేను సహాయం కోసం అడుగుతాను.. నాది పరిగణించినందుకు ధన్యవాదాలు. మీ గొంతులో మాయాజాలం మరియు శ్రావ్యత ఉన్నాయి.” అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం పవన్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆయన ఇలా ఒక నటుడికి సోషల్ మీడియాలో థాంక్స్ చెప్పడం ఇదే ప్రథమం కావడం విశేషం.

అయితే అంతకుముందు అర్జున్ దాస్ ఎక్స్‌లో.. ”పవన్‌ కళ్యాణ్ తన సినిమా ట్రైలర్‌కి వాయిస్ ఇవ్వమని అడిగినప్పుడు, మ‌నం అవును అనకుండా ఎలా ఉంటాం? ఎవరూ ప్రశ్నలు అడగరు. ఇది మీ కోసమే సార్. మీతోపాటు మొత్తం వీరమల్లు టీమ్ కి శుభాకాంక్షలు” అని అందులో తెలిపారు. దీనికి పవన్‌ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేయగా.. దీనిపై మళ్ళీ అర్జున్ దాస్ రిప్లై ఇచ్చారు.

“పవన్ కళ్యాణ్ సార్ ఈ మెసేజ్ నాకు ఎంత విలువైందో మీకు తెలియదు. మీరు చాలా అరుదుగా సహాయం కోరే వ్యక్తి అని నాకు తెలుసు. అయితే అరుదైన సందర్భాలలో, మీరు నన్ను అడగాలని అనుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. సార్, మీ విషయానికి వస్తే, నేను ఎల్లప్పుడూ ఒక కాల్ లేదా మెసేజ్ దూరంలో ఉంటానని దయచేసి గురుంచుకోండి” అంటూ అర్జున్ దాస్ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేసారు. కాగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం జూలై 24న విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.