డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి తమ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో ఇండియన్ సినిమాని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సీనియర్ నటి టబు, సంయుక్త మీనన్ మరియు శాండల్‌వుడ్ డైనమో విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ ఎక్సైట్‌మెంట్‌ని మరింత పెంచుతూ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది చిత్ర యూనిట్. ఈ ప్రాజెక్ట్‌లోకి మరో కొత్త బ్యానర్ ఎంటరైంది. జెబి మోషన్ పిక్చర్స్ బ్యానర్ అధినేత జె.బి. నారాయణరావు కొండ్రోళ్ల కూడా ఇప్పుడు ఈ సినిమా మేకింగ్‌లో భాగమయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరియు నిర్మాత ఛార్మి కౌర్ అధికారికంగా ప్రకటించారు. జూలై మొదటివారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఆయన అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, డిఫరెంట్ అవతార్‌ను చూడబోతున్నారు ఆడియన్స్. ఈ హైలీ యాంటిసిపేటెడ్ సినిమా కోసం పూరి జగన్నాధ్ పవర్ ఫుల్ కథని రాశారు. సినిమాకి సంబధించిన అన్నీ విషయాల్లో చాలా కేర్ తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులని అలరించే స్క్రిప్ట్, నటీనటులని ఎంపిక చేశారు. ఇది పూర్తి స్థాయి మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. పూరి సిగ్నేచర్ స్టైల్, విజయ్ సేతుపతి మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ బ్లెండ్ చేసే ప్రత్యేకమైన కథాంశంతో విభిన్నంగా ఉండబోతోంది.
మొత్తం కాస్ట్ అండ్ క్రూ ఇప్పటికే ఖరారు కావడంతో, టీం ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై అంతటా రెక్కీ చేస్తున్నారు. మొదటి షూటింగ్ షెడ్యూల్ కోసం సరైన లొకేషన్ల కోసం వెతుకుతున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభంకానున్న ఈ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన కొలాబరేషన్‌ని సూచిస్తోంది. కాగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో ఈ పాన్-ఇండియా ఎంటర్‌టైనర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఐదు భాషలలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: