పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మచ్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హిస్టారికాల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 24వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేశారు మేకర్స్. జూలై 3న థియేట్రికల్ ట్రైలర్ రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. జూలై 3న ఉదయం 11:10 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఈ ట్రైలర్ విడుదల చేయనుంది చిత్ర యూనిట్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.
హైదరాబాద్ లోని ప్రముఖ విమల్ థియేటర్‌లో ప్రత్యేకంగా వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరగనుండగా.. దీనిలో చిత్ర నిర్మాతలు ఏఎం రత్నం, దయాకర్ రావు, డైరెక్టర్ జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ తదితరులు పాల్గొననున్నారు. ఇదిలావుంటే హరిహర వీరమల్లు ట్రైలర్‌పై తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన కామెంట్స్ మరింతగా అంచనాలను పెంచేస్తున్నాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందించగా.. మనోజ్ పరమహంస కెమెరా, తోట తరణి ఆర్ట్ వర్క్ అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























