గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కలయికలో వచ్చిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చరణ్ నటన చాలా బావుందని టాక్ వచ్చినప్పటికీ కథ, కథనం, దర్శకత్వం లోపాల వలన చివరకు ఇది ప్లాప్ మూవీగా ముద్రపడి మెగా ఫ్యాన్స్‌కి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు దీనిపై స్పందించారు. రామ్ చరణ్‌తో సూపర్ హిట్ ఫిల్మ్ తీయాలని భావించామని, అయితే అనుకోని విధంగా అది కుదరలేదని అన్నారు.
ఈ మేరకు తాజాగా హీరో నితిన్‌తో తాను నిర్మించిన ‘తమ్ముడు’ సినిమా సెకండ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. త్వరలోనే చరణ్‌తో ఇంకో సినిమా చేయనున్నట్టు తెలిపిన ఆయన, ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయని, అతి త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కాగా దిల్ రాజు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై మెగాభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: