మొదటి వారం అదరగొట్టి 100కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చిన కుబేర రెండో వారంలోకూడా సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.సెకండ్ వీకెండ్ లో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించడంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది. కన్నప్పతో పోటీ వున్న కూడా సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో 10రోజుల్లో కుబేర ప్రపంచ వ్యాప్తంగా 120కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అయితే తమిళంలో మాత్రం అనుకున్నంతగా రెస్పాన్స్ రావడం లేదు.లేకపోతే కుబేర ఈజీగా 150కోట్ల మార్క్ ను క్రాస్ చేసేదే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అటు ఓవర్సీస్ లో మాత్రం కూడా కుబేర అదరగొడుతుంది.నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ధనుష్ అలాగే నాగార్జున కు ఇదే మొదటి 2 మిలియన్ డాలర్ సినిమా.ఇక కుబేర నాగ్ కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలువగా తెలుగులో ధనుష్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు నెలకొల్పింది.
ఇంతకుముందు సార్ తో టాలీవుడ్ లోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు కుబేర తో తన మార్కెట్ ను మరింతగా పెంచుకున్నాడు ధనుష్. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో ధనుష్,కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.సునీల్ నారంగ్ , పుస్కూర్ రామ్ మోహన్ నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























