మంచు విష్ణు కన్నప్ప భారీ అంచనాల మధ్య గత శుక్రవారం విడుదలై థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.నిన్న వర్కింగ్ డే లోకూడా స్ట్రాంగ్ హోల్డ్ తో సూపర్ వసూళ్లను రాబట్టుకుంది. దాంతో 4 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 60కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగా ఉండడంతో ఇదే జోరు కొనసాగించాల్సివుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో అదరగొడుతుంది. అందులో భాగంగా హిందీ శాటిలైట్ రైట్స్ భారీ ధర పలికాయి. 20 కోట్లకు ఓ ప్రముఖ ఛానల్ ఈసినిమా హక్కులను దక్కించుకుంది. ఇంకా తెలుగు రైట్స్ తోపాటు ఇతర భాషల రైట్స్ అమ్ముడవ్వాల్సి వుంది. అలాగే ఓటీటీ డీల్ కూడా క్లోజ్ కావాల్సివుంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఈ డీల్ కూడా భారీ ధర పలుకనుంది. ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో దాదాపు 60-70 కోట్ల వరకు రానుంది.
తన డ్రీం ప్రాజెక్ట్ కావడంతో మంచు విష్ణు ఈసినిమా కోసం బాగానే ఖర్చు చేశాడు.శివుడి భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈసినిమాలో కన్నప్పగా మంచు విష్ణు నటించగా మోహన్ బాబు ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు.ఇందులో ప్రభాస్ రోల్ అలాగే చివర్లో విష్ణు నటన హైలైట్ అని చెప్పొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: