శ్రీ గణేష్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘3 BHK’. బ్లాక్ బస్టర్ హిట్ ‘మావీరన్’ ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ తన విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్‌లో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు శరత్ కుమార్, దేవయాని తల్లిదండ్రులుగా నటిస్తుండగా.. కొడుకుగా సిద్దార్థ్, కూతురుగా మీతా రఘునాథ్ కనిపించనున్నారు. అలాగే చైత్ర, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, రెండు పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకుంది. ఇటీవలికాలంలో అన్ని ఇండస్ట్రీలలో హవా చూపిస్తోన్న టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో భారీ రిలీజ్ చేస్తోంది.
ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు అమ్రిత్ రామ్‌నాథ్ సంగీతం అందిస్తుండగా.. దినేష్ కృష్ణన్ బి & జితిన్ స్టానిస్లాస్ డీవోపీగా, గణేష్ శివ ఎడిటర్‌గా, రాకేందు మౌళి డైలాగ్ రైటర్‌గా పనిచేస్తున్నారు. కాగా 3BHK జూలై 4న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే గత కొంతకాలంగా తెలుగులో సరైన హిట్ లేని సిద్దూ ఈ సినిమాతోనైనా ఆ లోటు తీర్చుకోవాలని చూస్తున్నాడు. మరి అతడి కోరిక ఫలిస్తుందో, లేదో మరో పదిరోజుల్లో తెలియనుంది. చూడాలి ఏమవుతుందో..
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: