పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మచ్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హిస్టారికాల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి వచ్చింది. ఈ అడ్రినలిన్-చార్జ్డ్ రైడ్ కేరళలో భారీ రిలీజ్ కానుంది. ఈ సినిమా హక్కులను అక్కడ ఓ స్టార్ హీరో దక్కించుకున్నారు. ‘మహానటి, లక్కీ భాస్కర్’ ఫేమ్ దుల్కర్ సల్మాన్‌కి చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ ఈ మూవీని మలయాళంలో విడుదల చేస్తోంది.
కాగా ఇంతకుముందు కూడా దుల్కర్ సల్మాన్ పలు తెలుగు సినిమాలను కేరళలో రిలీజ్ చేశారు. తాజాగా వచ్చిన కుబేర, అంతకుముందు నాని నటించిన ‘హిట్ 3’ చిత్రాలను ఆయన మలయాళంలో రిలీజ్ చేశారు. అవి అక్కడ మంచి వసూళ్లనే దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని కూడా దుల్కరే విడుదల చేస్తుండటంతో కేరళలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పవర్ స్టార్ అభిమానుల్లో జోష్ నెలకొంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: