క్వీన్ పాన్-ఇండియా సంచలనం బాహుబలి తర్వాత, అనుష్క శెట్టి ప్రధానపాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. కాగా ‘వేదం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత అనుష్క, క్రిష్‌ల కలయికలో వస్తున్న రెండవ చిత్రం ఇది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జూలై 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో అనుష్క ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘సైలోరే’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటకు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి స్వయంగా సాహిత్యం అందించడం విశేషం.
ఇది జానపద ఊపుతో నిండిన ఓ ఎనర్జిటిక్ బ్లాస్టర్‌లా ఉంది. ప్రకృతిసౌందర్యంతో నిండిన అడవులను నేపథ్యంగా చేసుకున్న ఈ ఫోక్ వెడ్డింగ్ యాంథమ్‌లో లీడ్ పెయిర్ ఉత్సవంగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. అనుష్క, విక్రమ్ కొత్తగా పెళ్లి అయిన జంటగా సంగీతం, నృత్యం, సాంస్కృతిక వెలుగులతో చుట్టూ ఉంటూ అడవిని రంగుల విందుగా, మేళా తాళాలతో, భావోద్వేగాలతో నింపారు.
నాగవెళ్లి విద్యాసాగర్ స్వరపరిచిన ఈ మనసును తాకే పాట జానపదపు స్వరాలను భావోద్వేగాలకు మిళితం చేస్తూ అద్భుతంగా వుంది. కృష్ణ రాసిన సాహిత్యం హుషారు వుంది. లిప్సిక భాష్యం, సాగర్ నాగవెళ్లి, సోనీ కోమండూరి ఆలపించిన ఈ పాట ఉత్సవాన్ని మరింత పెంచింది. రాజు సుందరం కోరోయోగ్రఫీ అద్భుతంగా వుంది.
ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.. తోట తరణి ఆర్ట్ డైరెక్షన్, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. కాగా ఘాటి సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: