గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, బాలీవుడ్ నటుడు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, మరో రెండు ఫస్ట్-లుక్ పోస్టర్స్ సహా ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్ హ్యుజ్ బజ్ సృష్టించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి దివ్యేందు శర్మ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. నేడు దివ్యేందు జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ విషెస్ తెలుపుతూ.. సోషల్ మీడియాలో ఆయన లుక్ క్యారక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో ఆయన ‘రామ్ బుజ్జి’ అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలిపింది. కాగా పెద్దిలో దివ్యేందు విలన్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.
ఇకఇదిలావుంటే మరోవైపు పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు పెద్ది 30శాతం పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలో రీసెంట్‌గా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కాగా.. దీనికోసం ప్రత్యేకంగా నిర్మించిన భారీ రైలు సెట్‌లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతోంది. నవకాంత్ మాస్టర్ ఆధ్వర్యంలో రామ్ చరణ్ చేసిన ఈ హై-ఆక్టేన్ స్టంట్ భారతీయ సినిమాలో ఇప్పటివరకు ప్రయత్నించిన అత్యంత సాహసోపేతమైన సన్నివేశాలలో ఒకటిగా నిలవనుంది.
కాగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ, జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. చరణ్ జన్మదిన కానుకగా వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: