కుబేర లాంటి సినిమా చేయడానికి గట్స్ కావాలి – నాగార్జున

King Nagarjuna Reveals His Character in Kuberaa

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో వున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. జూన్ 20న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

కుబేర లాంటి మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేయడానికి కారణం?

  • మంచి కథలు రావాలంటే స్టార్స్ కలిసి పనిచేయాలి. ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు చేశాను.
  • నాన్నగారు (ఏఎన్ఆర్) ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు.. ఇలా అంతమంది కలిసి ఎన్నో సినిమాలు చేశారు.
  • శేఖర్ కమ్ముల గారితో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉండేది.
  • ‘ఆనంద్’ దగ్గర నుంచి ఆయన సినిమాలు గురించి మనందరికీ తెలుసు.
  • ఆయన సినిమాలు నాకు బాగా ఇష్టం. ఆయన కథల్లో సోషల్ రెలివెంట్ పాయింట్ ఉంటుంది.
  • మిగతావన్నీ కూడా కమర్షియల్ గానే ఉంటాయి. అద్భుతమైన పాటలు ఉంటాయి.

కుబేరలో ఉన్న యూనిక్ పాయింట్ ఏమిటి?

  • కుబేరలో చాలా మంచి యూనిక్ పాయింట్ ఉంది. ఇప్పుడున్న సొసైటీకి ఆ పాయింట్ చాలా రిలెవెంట్.
  • శేఖర్ గారికి ఈ పాయింట్ మైండ్‌లో ఎప్పటినుంచో ఉంది.
  • ఈ సినిమాల్లో మంచోళ్ళు ఉన్నారు. చెడ్డోళ్ళు ఉన్నారు.
  • అల్ట్రారిచ్, మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్.. ఇలా మూడు సొసైటీల మధ్య క్లాష్ ఈ సినిమాలో ఉంటుంది.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

  • నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్. సీబీఐ ఆఫీసర్ క్యారెక్టర్‌లో కనిపిస్తాను.
  • మంచి చేయాలా? చెడు చేయాలా? అనే సంఘర్షణ మధ్య ఆ క్యారెక్టర్ ఉంటుంది.
  • నా క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ వుంటాయి. శేఖర్ నా క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా రాశారు.
  • సటిల్డ్ పెర్ఫార్మన్స్‌కి మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్.
  • ఇందులో చాలా అద్భుతమైన ఇన్సిడెంట్స్ ఉంటాయి.
  • అవన్నీ కూడా రియల్ లైఫ్‌కి రిలేటెడ్‌గా ఉంటాయి.
  • ధనుష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అద్భుతంగా చేశాడు.

శేఖర్ గారు మీ ఇమేజ్ కి తగ్గట్టు స్క్రిప్ట్‌లో ఏమైనా మార్పులు చేశారా?

  • లేదండి. ఆయన ఏమనుకున్నారో అదే చేశారు.
  • నేను కూడా ఎలాంటి మార్పులు అడగలేదు. మారిస్తే చెడిపోతుంది.

మీ ఫ్యామిలీలో దాదాపుగా అందరూ శేఖర్ కమ్ముల గారితో చేశారు కదా.. ఆయన స్టైల్ గురించి ముందుగా ఎవరినైనా అడిగారా?

  • చైతన్యని అడిగాను. ‘ఆయన వర్కింగ్ స్టైల్ చాలా బాగుంటుంది.
  • మీరు సినిమా అంతా ఎంజాయ్ చేస్తారని’ చెప్పాడు

ఇప్పుడు వరకు మీరు చేసిన క్యారెక్టర్ అన్నిటిలో కుబేరలో క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుందా?

  • ఈ సినిమా కథ డిఫరెంట్. నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, రియాక్షన్.. అవన్నీ కూడా కొత్తగా ఉంటాయి.
  • శేఖర్ కమ్ముల స్టైల్‌లో ఉంటాయి.
  • సినిమాని దాదాపుగా రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశాం.
  • తిరుపతి, ముంబై, గోవా, బ్యాంకాక్ ఇలా అన్ని బిగ్ రియల్ లొకేషన్స్‌లో వర్క్ చేసాం.

రష్మిక మందన క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

  • తన క్యారెక్టర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. తను చాలా అద్భుతంగా చేసింది.
  • సినిమా చూసి నువ్వే స్టార్ అని చెప్పాను. ఆ కథలో చాలా రిప్రెషన్ క్యారెక్టర్ అది.

కుబేర నిర్మాతల గురించి?

  • సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహన్ గారు ఒక పెద్ద సినిమా చేయాలనుకున్నారు.
  • తెలుగు, తమిళ్.. పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్టుని చేయడం జరిగింది. చాలా పాషన్‌తో సినిమా తీశారు.
  • డైరెక్టర్ శేఖర్ కమ్ములకి కావాల్సినది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇచ్చారు. సినిమా చాలా అద్భుతమైన క్వాలిటీతో వచ్చింది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి?

  • ఈ సినిమాకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. పాటలు చాలా సిచువేషనల్‌గా వస్తాయి. దేవి వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు.
  • ఈ కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. రెగ్యులర్ స్క్రీన్ ప్లేకాదు. రొటీన్ క్యారెక్టర్స్ కావు. ప్రతీది డిఫరెంట్‌గా ఉంటుంది.
  • ఇందులో ఏ క్యారెక్టర్ కూడా హీరో, హీరోయిన్ అనడానికి లేదు. అన్ని పాత్రలు గానే ఉంటాయి.
  • ఇలాంటి సినిమాలు చేయడానికి గట్స్ కావాలి.

100 సినిమా ప్లానింగ్స్ జరుగుతున్నాయని విన్నాం?

  • అవునండి. ప్లానింగ్ చేస్తున్నాం. వర్కింగ్ టైటిల్ కింగ్ 100 అని పెట్టారు.

చాలా ఫిట్ గా కనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆహార నియమాల్లో ఏమైనా మార్పులు చేశారా?

  • లేదండి. గత 15 ఏళ్లుగా ఏం చేస్తున్నానో అదే చేస్తున్నాను. కొత్తగా చేసింది ఏమీ లేదు.

పాన్ ఇండియా ట్రెండ్ మీద మీ ఒపీనియన్?

  • పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని. అన్ని సినిమాలు దానికి సరిపోవు.
  • పాన్ ఇండియా సినిమా అని తీసినవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలో కావడం లేదు కదా.

శివ 4k పనులు ఎంతవరకు వచ్చాయి?

  • శివ 4కె ఫినిష్ అయింది. ఇంకా బెటర్ ఎఫెక్ట్స్ కోసం వర్క్ జరుగుతుంది.
  • చాలా బాగా వస్తుంది. ఒక రీల్ చూసాను. చాలా అద్భుతంగా ఉంది.

సితార బ్యానర్ లో మీరు ఒక సినిమా చేస్తారాని విన్నాం?

  • సితార, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఇలా అందరికీ చేయాలని ఉంది. అయితే ప్రాజెక్ట్ సెట్ కావాలి.

కూలీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?

  • కూలీలో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. లోకేష్ కనకరాజ్ కంప్లీట్ న్యూ ఏజ్ డైరెక్టర్.
  • క్యారెక్టర్ చాలా కొత్తగా వుంటుంది. ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేశాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.