ఫైనల్ షెడ్యూల్‌లో తెలుసు కదా..!

Star Boy Siddu Jonnalagadda's Telusu Kada Last Schedule Begins in Hyderabad

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ మరియు టిజి కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తుండగా.. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈరోజు చివరి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో ఈ చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా మరియు శ్రీనిధి శెట్టిలపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనితో సినిమా మొత్తం నిర్మాణం పూర్తవుతుంది. అదే సమయంలో, ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి.

ఇక ఈ నెలలోనే మొదటి పాటను విడుదల చేసి మ్యూజిక్ ప్రమోషన్స్‌ను కూడా త్వరలో ప్రారంభించాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. కాగా ఈ చిత్రానికి సంగీతం థమన్ ఎస్ అందిస్తున్నాడు. తెలుసు కదా చిత్రాన్ని డైరెక్టర్ నీరజ కోన మనసుకి హత్తుకునే విధంగా తెరకెక్కిస్తున్నారు. సున్నితమైన ఈ ప్రేమ కథ పర్శనల్ గ్రోత్, రిలేషన్‌షిప్స్ మధ్య సాగుతుంది. అద్భుతమైన ఎమోషన్, హ్యుమర్‌తో ప్రేక్షకులని అలరించబోతోంది.

ఇక ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ స్టైలిష్‌గా కనిపిస్తూ చాలా మెచ్యూర్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. అలాగే ఇందులో వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకి జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ, నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తుండగా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌, షీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. తెలుసు కదా అక్టోబర్ 17న దీపావళి పండుగ సందర్భంగా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.