టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో వస్తున్న సినిమా 8 వసంతాలు.మ్యాడ్ ఫేమ్ అనంతిక సునీల్‌కుమార్ లీడ్ రోల్ లో నటించగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.ఈసందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ..అందరికి నమస్కారం.మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారు చాలా అద్భుతమైన వ్యక్తులు. చిన్న సినిమా పెద్ద సినిమాని కాదు… మంచి సినిమానా కాదా అనేది చూస్తారు. ఒక మంచి సినిమా వస్తే చేస్తారనే దానికి నేనే నిదర్శనం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మనిషిని మనిషిగా చూడటం చాలా కష్టం. మైత్రి మూవీ మేకర్స్ మనిషిని మనిషి లాగా చూస్తారు.అందుకే ఇండియాలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా వున్నారు.ఈ సినిమాతో ఒక మంచి సినిమా నిర్మించారనే పేరు వారికి వస్తుందని ఖచ్చితంగా చెప్పగలను.చాలామంది కొత్తవారికి ఉనికిని ఇచ్చారు.ఇది డబ్బు కంటే చాలా గొప్ప విషయం.ఈసందర్భంగా మా టీం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.మంచి కథ ఉంటే మైత్రిలోకి ఎలాగోలా రావచ్చు.సినిమాకి పని చేసిన నటీనటులకు టెక్నీషియన్స్ కి అందరికీ పేరుపేరు నా ధన్యవాదాలు.అనంతిక ఈ సినిమా చేయడానికి డబ్బు కూడా అక్కర్లేదని చెప్పింది.ట్యాలెంట్ కంటే ఇలాంటి పాషన్ ఉండడం చాలా గొప్ప విషయం.
ఒక 17 ఏళ్ల అమ్మాయికి డబ్బు సంపాదించుకోవడం తెలుసు, వద్దు అనుకోవడం తెలుసు.ఇది చాలా గొప్ప విషయం. తను చాలా గొప్ప పెర్ఫార్మర్ అవుతుంది.శుద్ధి అయోధ్య పాత్రలో అద్భుతంగా నటించింది.ఈ సినిమా ఓపెన్ సీక్వెన్స్ మిస్ అవ్వొద్దు.సినిమా అంతా రివర్స్ లో వెళ్తుంది. అందుకే ఓపెనింగ్ సీక్వెన్స్ ఎవరు మిస్ అవ్వద్దు అని కోరుతున్నాను.చాలా మంది కమర్షియల్ సినిమా తీయొచ్చు కదా అంటున్నారు.పెన్ ఓ పదినిమిషాలు పక్కన పెట్టి ఈ ప్రేమ, మనసుకు సంబంధించిన విషయాలు ఎందుకని ఆలోచిస్తే ఎలా ఉంటుందో వారణాసి లో ఫైట్ చూస్తారు.ఇంత బలంగా చెప్పడానికి కారణం ఆలోచన, టీం వర్క్. కమర్షియల్ సినిమా తీయలేక కాదు తీయాలని లేక.నాకు ఆడియన్స్ పై ఎప్పుడూ నమ్మకం వుంది. తప్పకుండా ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. సినిమా చూసిన తర్వాత ప్రేమ తత్వం బోధపడుతుంది.ప్రేక్షకుడిగా థియేటర్ కి వెళ్ళిన ప్రేక్షకులు ప్రేమకూలిగా తిరిగివస్తారు.జూన్ 20న తప్పకుండా సినిమా థియేటర్స్ లో చూడాలని కోరుతున్నానని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: